Fri Dec 19 2025 19:10:03 GMT+0000 (Coordinated Universal Time)
చిరుతో చిందులేసిన భామ చిత్రం ఇదే


చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం లో చిరు కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఖైదీ నెంబర్ 150 లో ఒక ఐటెం సాంగ్ ఉందని ఆ సాంగ్ లో లక్ష్మి రాయ్ నటిస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం లో లక్మి రాయ్ ఐటెం సాంగ్ లో చిరు పక్కన రెచ్చిపాయి నటించిందని అంటున్నారు. దానికి సాక్ష్యం గా లక్ష్మి రాయ్ ఒక పిక్ ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పిక్ తాను ఖైదీ నెంబర్ 150 సెట్స్ లో తీసుకున్నదని చెబుతుంది. ఆ పిక్ లో లక్ష్మి రాయి కొత్తగా కనిపిస్తుంది. తెగ గ్లామర్ ఒలకబోస్తూ హొయలుపోతూ కనిపించింది ఇక లక్ష్మి ఏ రేంజ్ లో ఖైదీ... స్పెషల్ సాంగులో మెరవనుందో ఈ ఫొటోస్ చూస్తే అర్ధమైపోతుంది.
Next Story

