చిరుతో కూడా ఆ రేంజిలో చేస్తుందా?

ఆమె వయసు 31. కానీ ఈ వయసులో కూడా వరస చిత్రాలు ఫ్లాప్ అవుతున్నా కూడా క్రేజీ ఆఫర్లను ఒడిసిపట్టుకుంటోంది. ఈ మధ్య వయసు హీరోయిన్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెం: 150', అజిత్‌తో ఆయన '57' వ చిత్రం, యువ తమిళ హీరో జీవాతో మరో చిత్రం చేస్తోంది. కాగా ఆమధ్య వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలోని ఓ పాటలో తన అందాల ఆరబోతతో తెలుగు యువ ప్రేక్షకులను గిల్లిగింతలు పెట్టిన కాజల్ ఈమధ్య వచ్చిన బాలీవుడ్ చిత్రం 'దో లఫ్జోంగీ కహాని' చిత్రంలో లిప్‌లాక్‌లు, వేడి వేడి సన్నివేశాల్లో నటించింది. కానీ అక్కడ ఫలితం రాలేదు. ఇక బాలీవుడ్లో ఉన్న కాలంలో ఆమె వివిధ సినిమా అవార్డు ఫంక్షన్లకు పొట్టి పొట్టి దుస్తులతో వెళ్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. కానీ ఆమెను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు.
ఇక 'బ్రహ్మోత్సవం, సర్దార్‌గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్ చిత్రాల తర్వాత 'జనతాగ్యారేజ్'లో చేసిన ఐటం సాంగ్ 'నేను పక్కాలోకల్..' పాటలో అందాల ఆరబోతకు ప్రయత్నం మొదలు పెట్టింది. ఇక తాజాగా తమిళంలో ఆమె జీవా హీరోగా చేస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయి సెన్సార్‌కు వెళ్లింది. ఈ చిత్రంలో బికినీతో వేయడంతో పాటు తన అందాల హద్దులను దక్షిణాధికి కూడా రుచిచూపించిందిట. ఈ చిత్రాన్ని చూసిన తమిళ సెన్సార్‌బోర్డ్ సభ్యులు కూడా ఈ చిత్రంలో కాజల్ చూపించిన ఎక్స్‌పోజింగ్‌కు షాక్ తిన్నారని సమాచారం. అలాగే చిరంజీవి 'ఖైదీనెంబర్150' చిత్రంలో కూడా తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టి, చిరు తర్వాత ఈ చిత్రానికి ఆమె అందాలే ప్లస్ పాయింట్ కానున్నాయని సమాచారం. మొత్తానికి లేటు వయసులో ఈ భామ కుర్రహీరోయిన్లకు కూడా పెద్ద పోటీగా మారింది.
అయితే తెలుగులో కొంతగ్యాప్ తర్వాతే అవకాశం దక్కించుకున్న కాజల్ మెగాస్టార్ చిత్రంలో కూడా అదే రేంజిలో అందాలు ఒలకబోస్తుందా? మెగాస్టార్ అందుకు అనుమతిస్తారా? అనేది ఇండస్ట్రీ ముందున్న ప్రశ్న.

