చిరు సైరా లుక్ అదేనా?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి దేశంలో ని పలు భాషల్లో తెరకెక్కుతుంది. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ నుండి అతి భారీ అంచనాలే ఉన్నాయి. మరి చిరు సినిమాలకు పదేళ్ల పటు విరామం ఇచ్చినా ఖైదీ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాడు. అందుకే ఇప్పుడు చిరు సైరా గురించి కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లోనే మొదలైన సైరా మూవీ షూటింగ్ మాత్రం అనుకున్నంత సాఫీగా జరగడంలేదు. మధ్యలో చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ ఎదురైనా కూడా ప్రస్తుతం సైరా సెకండ్ షెడ్యూల్ మాత్రం స్టార్ అయ్యింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మించిన అతి భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్నం సైరా సినిమా సెట్స్ నుండి ఒక పిక్ లీకైంది. మరి అలా ఎటువంటి న్యూస్ గాని, పిక్స్ గాని లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలా సైరా షూటింగ్ పిక్ లీక్ అవడంతో సైరా యూనిట్ షాక్ అయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ ఎలా ఉండనున్నారనే విషయం ఈ లుక్ లో చూచాయగా తెలుస్తుంది. అక్కడ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి పక్క బిల్డింగ్ మీద నుంచి తీసిన ఈ లుక్ లో.. నరసింహారెడ్డి పాత్రలో చిరు లుక్ ను లీక్ చేసేస్తోంది.
మరి ఆ లీకైన పిక్ లో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లుక్ అంతగా స్పష్టంగా కనబడడం లేదు... కానీ ఈ లీకెడ్ పిక్ మాత్రం నెట్ లో వైరల్ అయ్యింది. ఇక మెగాస్టార్ ఈ పిక్ లో క్లారిటీగా కనబడడం లేదుగాని లేకుంటే యూనిట్ మాత్రం మరింత కంగారు పడాల్సి వచ్చేది. భారీ స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ సినిమా ని సురేందర్ రెడ్డి ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు


