చిరు వార్నింగ్ ని కేర్ చెయ్యని చరణ్, ఉపాసన

రామ్ చరణ్ సినిమా షూటింగ్ లతోను, ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహార బాద్యతల్లోనూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే చిరు ఉన్నట్టుండి రామ్ చరణ్ అతని భార్య ఉపాసనని ఇంట్లోనుండి పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చాడట. మరి వాళ్ళేం చేస్తే చిరు అంతటి వార్నింగ్ ఇచ్చాడో తెలుసా.. రామ్ చరణ్ కి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. కేవలం ఇష్టమే కాదు ప్రాణం కూడా. అందుకే చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక జంతువును పెంచుకుంటూ ఉండడం.. వాటితో చరణ్ టైం స్పెండ్ చేసేటప్పుడు వాటిని ఫోటోలు తీసి ఉపసన సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం ఈ మధ్యన పరిపాటి అయ్యింది.
వాళ్ళ పెంపుడు జంతువుల్లో కుక్కలు, పిల్లులు, నెమళ్ళు, కోళ్లు, గుర్రాల.. ఆఖరికి ఒంటె కూడా ఉంది. ఇక వీళ్ళ పెంపుడు జంతువులతో పాటే రామ్ చరణ్ వాళ్ళ దగ్గరికి అమల నడిపిస్తున్న బ్లూ క్రాస్ లో... జంతువులు ఎక్కువుగా ఉంటే .. ఆ ఎక్కువ అయిన జంతువులని తమ ఇంటికి పంపుతారని.. అలాగే జూ లో జంతువులను సరిగ్గా పట్టించుకోకపోతే జూ అధికారులు అక్కడి జంతువులని తెచ్చి తమ ఇంటి వద్ద వదిలేస్తారని... ఈ జంతువులన్నిటికి ఇప్పుడు ఏకంగా పెద్ద ఫామ్ హౌస్ కట్టించాల్సిన పరిస్థితి వచ్చిందని చరణ్ చెబుతున్నమాట.
అలాగే ఇంట్లో ఎక్కడ చూసిన ఈ పెంపుడు జంతువులే కనబడడంతో.. చిరంజీవి... చరణ్ ని ఉపాసనని పిలిచి ఇంట్లో మనుషులకన్నా జంతువులే ఎక్కువుగా కనబడుతున్నాయని... ఇలా జంతువులూ ఎక్కువైతే.. మిమ్మల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తానని.. స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడట. అయినా చరణ్, ఉపాసన మాత్రం చిరు వార్నింగ్ ని అస్సలు కేర్ చెయ్యకుండా తమ దగ్గర ఉన్న పెంపుడు జంతువులని చిన్న పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారట. ఈ విషయాన్నీ చరణే స్వయంగా చెప్పాడు మరి. అదండీ చిరు.. చరణ్ కి ఉపాసనకు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం.

