చిరు మాదిరిగానే ప్రత్యక్ష రాజకీయాలలోకి కళ్యాణ్

మెగా స్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజన్స్ కి వున్న క్రేజ్ ఏంటో ఎన్ని తరాలు మారినా ప్రతి తరం వారికి పరిచయం చేస్తూనే వున్నాయి ఆయన నటిస్తున్న చిత్రాలు. గ్యాంగ్ లీడర్ వంటి మాస్ సినిమా తోనైనా, రుద్రవీణ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రమైనా, హిట్లర్ వంటి సెంటిమెంట్ సినిమా అయినా, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి కామెడీ చిత్రమైనా, ఠాగూర్ వంటి సామాజిక సందేశమున్న చిత్రాలైనా ఎలాంటి పాత్రలైనా ప్రేక్షకులకి గుర్తిండిపోయేలా అభినయం ప్రదర్శించకలిగిన నటుడు మెగా స్టార్ చిరంజీవి. ఆయన చరిష్మా ఆయన కుటుంబంలో కూడా మరెవరికి రాలేదు. అయితే వెండితెరపై ఇంత క్రెడిబిలిటీ వున్న హీరో కి సైతం శంకర్ దాదా జిందాబాద్ వంటి ఫెయిల్యూర్ రాజకీయ ప్రవేశం పై ఎఫెక్ట్ కొట్టింది.
సినిమా విజయాపజయాలు రాజకీయ పరమైన ఓట్లుగా మారటం అసంభవం అయినప్పటికీ మెగా అభిమానులని ఒక సెంటిమెంట్ బాగా కలవరపెడుతుంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన చిరు ముఖ్య మంత్రి అవుతారని ఆశించిన అభిమానులకి నిరాశ మాత్రమే మిగిలింది. ఇక ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అజ్ఞ్యాతవాసి వంటి ఘోర పరాజయం అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం సెంటిమెంట్ పరంగా కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్న అభిమానులని భయపెడుతుంది. పైగా ఇప్పట్లో సినిమా ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు కళ్యాణ్. మరి జనసేన సిద్ధాంతాలతో వారి కుటుంబానికి వున్న బాడ్ సెంటిమెంట్ ని ఎలా తిరగరాస్తారో 2019 ఎన్నికలు తేల్చనున్నాయి

