Mon Dec 22 2025 18:00:39 GMT+0000 (Coordinated Universal Time)
చిరకాల మిత్రుల రహస్య భేటీ!!

రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చిరకాల మిత్రులు. వీరిద్దరి స్నేహ బంధం ఎప్పుడో మొదలైంది.వీరు తరుచూ ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కలుస్తూ ఒకరికొకరు పలకరించుకుని ముచ్చట్లు చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం తో వీరు కలవకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ఇద్దరికీ ఈ మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎవరి ట్రీట్మెంట్స్ లో వారు బిజీ అయ్యారు. రజిని చికిత్స రీత్యా అమెరికాలో వైద్యం చేయించుకుని ఇటీవలే చెన్నై కి తిరిగొచ్చాడు. అయితే రజినీని పరామర్శించడానికి కమల్ వెల్దామనుకునేలోపు రజిని మళ్ళీ అమెరికా వెళ్లడం తో కలవడం కుదరలేదు.
ఇక తర్వాత రజినీని పలకరిద్దామనుకుంటే కమల్ కూడా గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. కమల్ హాసన్ తన శభాష్ నాయుడు షూటింగ్ లో మెట్లపై నుండి జారిపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికకు అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ సోమవారం రాత్రి కలిసారని కోలీవుడ్ మీడియాలో ఒకటే న్యూస్. రజినీకాంత్ స్వయంగా కమల్ హాసన్ ఇంటికి వచ్చారని.... కమల్ కూడా గుమ్మనుండే రజినీని సాదరంగా లోపలి ఆహ్వానించాడని సమాచారం. కమల్ ఆరోగ్యం గురించి తెలుసుకుని కమల్ ని పరామర్శించడానికి రజినీ కమల్ ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ భేటీ మాత్రం రహస్యంగానే జరిగింది. ఇక ఒకరి ఆరోగ్య సమస్యలు మరొకరు కనుక్కున్నట్లు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత కలవడం తో ఇద్దరూ ఎంతో ఆత్మీయం గా మాట్లాడుకుని భావోద్వేగానికి లోనైనట్లు చెబుతున్నారు.
ఇక ఈ భేటీ గురించి కమల్ హాసన్ కి సహాయకుడిగా ఉంటున్న రాజేష్ ఎం.సెల్వా బయటపెట్టాడు. కమల్, రజినీ కలుసుకున్నప్పుడు రాజేష్ ఎం.సెల్వా వారిద్దరితో ఒక ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తో ఈ భేటీ విషయం బయటికి వచ్చింది. ఎంతైనా ఇద్దరు బడా స్టార్స్ కలిస్తే అది సంచలన విషయమే అవుతుంది కదా. ఇక రజినీ రోబో 2 .0 తో బిజీగా ఉండగా... కమల్ కూడా తన శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.
Next Story

