చిన్న సినిమా రైట్స్ కోసం భారీ లాబీయింగ్

తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై ప్రభంజనం సృష్టిస్తున్న 'అర్జున్ రెడ్డి' చిత్రానికి ఇప్పుడు పక్క భాషల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు సంబంధించి తమిళ రీమేక్ రైట్స్ ఇప్పటికే హీరో ధనుష్ చేజిక్కించుకోగా... ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యాలని 'అర్జున్ రెడ్డి' హిందీ హక్కుల కోసం ఒక హీరో ట్రై చేస్తున్నాడట. ఆ హీరో 'అర్జున్ రెడ్డి' మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు.
ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ఇష్టపడే రణ్వీర్ సింగ్ కు 'అర్జున్ రెడ్డి' చిత్రం చాలా బాగా నచ్చిందట. బాలీవుడ్ క్రిటిక్స్ కొంతమంది చెప్పిన సలహాల మేరకు అర్జున్ రెడ్డి సినిమాను చూసిన రణ్వీర్ సింగ్, ఆ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేసాడని..... ఎలాగైనా 'అర్జునరెడ్డి' హిందీ రీమేక్ లో నటించడానికి డిసైడ్ అయ్యాడనే వార్తలను బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అందుకోసమే తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలు 'అర్జున్ రెడ్డి' రీమేక్ రైట్స్ తీసుకోమని పురమాయించినట్టుగా చెబుతున్నారు.
.
అయితే ఈ రణ్వీర్ సింగ్ ఇప్పటికే ఎన్టీఆర్ హిట్ సినిమా 'టెంపర్' రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి 'టెంపర్' రీమేక్ సెట్స్ పైకి వస్తుందట. ఆ సినిమా పూర్తి కాగానే 'అర్జున్ రెడ్డి' రీమేక్ కూడా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ఈ 'అర్జున్ రెడ్డి' రీమేక్ రైట్స్ కోసం మరికొందరు బాలీవుడ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని... అలాగే ఈ సినిమాలో ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా స్టార్ట్ అయ్యిందట. మొత్తం మీద బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని భాషల్లో భలే డిమాండ్ ఏర్పడింది. ఇక 'అర్జున్ రెడ్డి' నిర్మాతలు మాత్రం ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు.

