చిన్న నిర్మాతలకు వరంగా మారతాడా?

సినిమాలల్లో సక్సెస్ అయ్యి వ్యాపారం పై ఫోకస్ చేసి లాభాలు దకించుకుంటున్నారు టాలీవుడ్ హీరోస్. ప్రసుతం టాలీవుడ్ బిజినెస్ మెన్స్ చాలానే ఉన్నారు. అందులో టాప్ లో ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ మొదట్లో కేవలం తన సినిమాలతోనే లాభాలను అందుకునే చరణ్ ఆ తర్వాత వివిధ రకాల వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యాడు.
డొమెస్టిక్ లెవెల్ లో ట్రూజెట్ ఎయిర్ లైన్స్ ని నడుపుతూ.... అతి తక్కువ కాలంలోనే ప్రొడ్యూసర్ గా మారి తన తండ్రి రీ-లాంచ్ చేస్తూ.. సొంత ప్రొడక్షన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించాడు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇక ఫూట్ బాల్ - కబడ్డీ లాంటి క్రీడలలో జట్లను కొనుగోలు చేసి అన్ని రంగాల వ్యాపారాలను బాగా తెలుసుకున్నాడు.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరొక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే ఆంద్రప్రదేశ్ - తెలంగాణ లో థియేటర్స్ ని కొనుగోలు చేయనున్నాడట. రామ్ చరణ్ తో పాటు టాలీవుడ్ లో ఇప్పుఇప్పుడే పేరు తెచ్చుకుంటున్న యూవీ క్రియేషన్స్ తో కలిసి చరణ్ ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. రామ్ చరణ్ అయినా చిన్న సినిమాలకి ధియేటర్స్ ఏమన్నా ఇప్పిస్తాడా? లేదా బడా నిర్మాతలు లాగ చిన్న సినిమాలకి థియేటర్స్ దక్కనివ్వకుండా చేస్తాడా? లేదో చూడాలి.

