Tue Mar 24 2026 16:29:10 GMT+0530 (India Standard Time)
చిట్టిబాబు మీ స్పందన కోసం వెయిట్ చేస్తున్నాడు

ఈ నెల 30న రిలీజ్ అయ్యే 'రంగస్థలం' సినిమా కోసం ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని తన భర్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో తెలిపింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటుంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్నా 'రంగస్థలం' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెవిటి వాడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా సమంత డిగ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఈనెల 30న 'రంగస్థలం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా చరణ్ భార్య ఉపాసన... ‘చిట్టిబాబు’ మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాడని వ్యాఖ్యానించింది. చిట్టిబాబు గెటప్ లో ఉన్న చరణ్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది.
Next Story

