చాలా అందంగా భయపెడుతుందట!!

టాలీవుడ్ లో రెజినా చిన్నా, పెద్ద హీరోలతో నటిస్తూ బిజీ అయిపోయింది. గ్లామర్ పరంగా పర్వాలేదనిపించిన ఈ భామ నటన కి 100 శాతం మార్కులు వేయించుకుంటూ ఆఫర్స్ పట్టేస్తుంది. ఇక ప్రస్తుతానికి రెజినా తెలుగులో కృష్ణ వంశీ డైరెక్షన్ లో 'నక్షత్రం' సినిమా లో నటిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ పరం గా రెచ్చిపోయిన రెజినా ఇప్పుడు ఒక అందమైన దెయ్యంలా కనిపిస్తుందని అంటున్నారు. అదీ ఒక తమిళ సినిమా అయిన 'నింజామ్ మారప్పతిల్లై' లో. ఈ సినిమాని డైరెక్టర్ సెల్వరాఘవన్ తెలుగు, తమిళంలో ఏకకాలం లో తెరకెక్కిస్తున్నాడు. ఇక తొలిసారి హారర్ చిత్రం లో నటిస్తున్న రెజినా 'నింజామ్ మారప్పతిల్లై, సినిమాలో అందమైన దెయ్యంలా కనిపించనుందని ఆ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రం లో రెజీనా... నిఖిల్ తో కలిసి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం లో కీ రోల్ లో నటించిన నందిత శ్వేతతో కలిసి నటించబోతుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం. ఇక అందమైన దెయ్యం రెజినా ఫస్ట్ లుక్ ఫోటోని మీరు ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యండి.

