చాన్నాళ్ళకి బయటికి వస్తుంది

'బాహుబలి' సినిమా షూటింగ్ టైం లోనే అనుష్క మెయిన్ లీడ్ గా ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్షన్ లో ‘భాగమతి’ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సినిమా ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకు ఒక ఫస్ట్ లుక్ గాని దానికి సంబందించిన ఒక న్యూస్ గాని ఎక్కడ బయటకి రాలేదు. అయితే మొన్నామధ్యన 'భాగమతి' ఫస్ట్ లుక్ తో పాటే సినిమా కూడా అతిత్వరలోనే విడుదలంటూ కొన్ని వార్తలు మీడియాలో హల్చల్ చేసాయి. ఆ తర్వాత మళ్ళి 'భాగమతి' గురించి ఇంతవరకు ఎటువంటి న్యూస్ లేదు.
ఇక ఇపుడు తాజాగా 'భాగమతి' షూటింగ్ కంప్లీట్ చేసుకుందని.... ఈ సినిమాకి సంబందించిన న్యూ అప్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని భాగమతి నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ వారు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. మరి బాహుబలిలో దేవసేనగా అలరించిన అనుష్క భాగమతిగా ఎలా ఉండబోతుందో అని అందరూ ఇప్పుడు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతున్నాడు.
'బాహుబలి' తర్వాత అనుష్క నటించిన చిత్రం 'భాగమతి' కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని చెబుతున్నారు.

