చరణ్ - బోయపాటి నిజమేనా?

'సరైనోడు, జయ జానికి నాయక' వంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి... గత కొన్ని నెలలుగా ఖాళీగా వున్నాడు. అయితే ఆ ఖాళీ సమయంలో తన నెక్స్ట్ మూవీ చిరంజీవితో ఉంటుంది అని.... బాలకృష్ణతో ఉంటుంది అని.... ఆలా చాలా పుకార్లు ఫిలింనగర్ లో షికార్లు చేసాయి.. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఇంకో పుకారు బయటికొచ్చింది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన పుకారు కాదుగాని... ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న గాసిప్పే. బోయపాటి మెగా హీరో రామ్ చరణ్ తో ఒక మాస్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్నాడు అని.
అయితే ఇప్పుడు ఆ రూమర్ కి మరింతగా బలం చేకూరుస్తూ రామ్ చరణ్ తో బోయపాటి సినిమా కన్ఫర్మ్ అయినట్టు ఫిలింనగర్ లో ఈ పుకారు హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం రాంచరణ్ 'రంగస్థలం' లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తో సినిమా ఉండొచ్చని ఫిలింనగర్ సమాచారం. కానీ ఇంతలోనే బోయపాటితో సినిమా అని పుకారు రావడంతో మెగా ఫాన్స్ మాత్రం ఫుల్ కన్ఫ్యూషన్ లో వున్నారు. మరి ఈ పుకార్లను బట్టి....చూద్దాం మెగా పవర్ స్టార్ తో బోయపాటి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో.

