చరణ్... అభిమన్యు నారాయణ...?

సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985 ' చిత్రంమొత్తం పల్లెటూరి బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కుతుంది. అందుకోసమే రోజులు తరబడి సుకుమార్ రాజమండ్రి, పాలకొల్లు, కొల్లేరు, గోదావరి పరిసరప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఆ చిత్రంలోని లుక్స్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మాత్రం పక్కా మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పేరు .. అభిమన్యు నారాయణ్ అని అంటున్నారు ? ఇందులో చరణ్ చేపలు పెట్టె కుర్రవాడిపాత్రలో కనిపిస్తాడని, 1985 నాటి కాలంలో జరిగిన ప్రేకథగా ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ చిత్రానికి రంగస్థలం అని టైటిల్ పెట్టడంతోనే చరణ్ ఈ చిత్రంలో నాటకాలు వేసుకునే కుర్రాడు పాత్ర పోషిస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. అందుకే ఈచిత్రానికి రంగస్థలం అనే టైటిల్ పెట్టారని కూడా అంటున్నారు. కానీ రంగస్థలం అనే ఒక ఊరిలో ఈ ప్రేమ కథ ఉంటుందని అందుకే ఈ సినిమాకి రంగస్థలం టైటిల్ పెట్టామని అంటుంది చిత్ర యూనిట్. ఇకపోతే రంగస్థలం అనే ఊరిలో అభిమన్యు నారాయణ అనే కుర్రాడు ప్రేమ కథే ఈ 'రంగస్థలం 1985 ' కథగా ఇప్పుడు కొత్తగా ప్రచారం మొదలైంది.
రామ్ చరణ్ ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకటి పల్లెటూరి కుర్రవాడిగా.... గళ్ళ లుంగీ .. గుబురు గడ్డం తో ఉండగా మరొకటి మోడ్రెన్ కుర్రవాడిగా కనబడతాడనే టాక్ వినబడుతుంది. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉందన్నది పక్కన పెడితే .. చరణ్ కెరీర్ లో ఒక భిన్నమైన పాత్ర పోషించే అవకాశం మాత్రం దక్కిందంటున్నారు . త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట.

