Sun Dec 14 2025 06:06:15 GMT+0000 (Coordinated Universal Time)
గురు పాసిటివ్ టాక్ తో దూసుకుపోతుంది!!

విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన 'గురు' చిత్రం నిన్న శుక్రవారం విడుదలై థియేటర్స్ లో దూసుకుపోతుంది. 'గురు' చిత్రానికి క్రిటిక్స్ కూడా మంచి మార్కులేసేసారు. 'గురు' చిత్రంలో వెంకటేష్ నటనకు, లుక్ కు మంచి స్పందన వస్తుంది. 'గురు' విడుదలైన ప్రతిచోటా పాసిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే వెంకటేష్ కెరీర్ లో 'గురు' చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.
ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు మంచి వసూళ్లను రాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ 2.51 కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఈ చిత్రానికి మొదటిరోజు కలెక్షన్స్ కంటే రెండో రోజు ఇంకొంత పెరిగే అవకాశం ఉందని... సో ఆలెక్కన 'గురు' చిత్రం రెండో రోజు వసూళ్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Tags
- గురు
Next Story
