'గరుడ వేగా' మొదటి 4 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన 'గరుడ వేగా' తోలి రోజే రెస్పాన్స్ ఎలా వచ్చిందో మనకి తెలుసు. సినిమా చూసినా ప్రతి ప్రేక్షకుడు హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోదని ప్రశంసలు కురిపించారు. అయితే రిలీజ్ అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ బాగా వస్తాయని భావించారు అందరు. కానీ సినిమా అందరి ఊహను తారుమారు చేసింది. తొలి రోజు రూ. 66 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత శని, ఆదివారాల్లో ఏమంత గొప్పగా రాబట్టలేకపోయింది. ఫస్ట్ డేతో పోలుచుకుంటే..మౌత్ టాక్ వల్ల కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉందని భావించారు. కానీ సోమవారం మరింత దారుణంగా ఈ కలెక్షన్స్ నమోదయ్యాయి. దీంతో 4 రోజులు ముగిసేసరికి వరల్డ్ వైడ్ షేర్ రూ. 3.9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
ఈ సినిమా రూ.11 కోట్లుకి అమ్ముడుపోగా..ఇప్పటికి వరకు కేవలం రూ.3.9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సేఫ్ జోన్ చేరాలంటే ఇంకా రూ. 7.1+ కోట్లు కలెక్ట్ చేయాలి. ఈ సినిమా మొదటి 4 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్ మీకోసం.
ఏరియా షేర్స్(కోట్లలో)
నైజాం 1.25
సీడెడ్ 0.36
ఉత్తరాంధ్ర 0.40
ఈస్ట్ గోదావరి 0.23
వెస్ట్ గోదావరి 0.13
కృష్ణ 0.22
గుంటూరు 0.30
నెల్లూరు 0.07
ఏపీ + తెలంగాణ 2.96
యూఎస్ఏ 0.64
కర్ణాటక + రెస్ట్ 0.30
టోటల్ వరల్డ్ వైడ్ 3.90

