ఖాకి ఫస్ట్ వీకెండ్ ఏపీ మరియు తెలంగాణ కలెక్షన్స్

గత శుక్రవారం ఏకంగా ఏడెనిమిది సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే వీటిలో అట్టర్ ఫ్లాప్.. అసలు సోదిలోకి లేకుండా పోయినవే ఎక్కువ. మంచి టాక్ తెచ్చుకుని థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమాలు గృహం, ఖాకి సినిమాలు మాత్రమే. వీటిలో గృహం సినిమాను అంతా బాగుందంటున్నారు కానీ, హారర్ జానర్ అవ్వడంతో ఎక్కువ మంది చూడడం లేదు. దీంతో ఆ మూవీకి వసూళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇక కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఖాకి సినిమాకు మాత్రం డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన ఈ 3 రోజుల్లో ఖాకి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 52 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమాకు ఇంత షేర్ అంటే అది చెప్పుకోదగ్గ విశేషమే. కార్తీ సినిమా ఇక్కడ తెలుగులో ఈ రేంజ్ లో వసూలు రావడం రికార్డనే చెప్పాలి.
ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్ (కోట్లలో)
నైజాం – 1.16
సీడెడ్ – 0.56
ఉత్తరాంధ్ర – 0.5
గుంటూరు – 0.39
ఈస్ట్ – రూ. 0.31
కృష్ణా – 0.30
వెస్ట్ – 0.19
నెల్లూరు – 0.11
మొత్తం షేర్ – 3.52 కోట్లు

