Sun Dec 21 2025 20:44:00 GMT+0000 (Coordinated Universal Time)
కోల్డ్ ప్లే కి విందుకు సినీ ప్రముఖుల సందడి

తాజాగా సంగీత ప్రియులకు భారత దేశంలో గ్లోబల్ సిటిజెన్ కోసం జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ ఒక మధుర జ్ఞాపకంలా జీవిత కాలం మిగిలిపోనుంది. ఇందుకు కారణం ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ క్రిస్ మార్టిన్ తన కోల్డ్ ప్లే బ్యాండ్ బృందంతో మన వేదిక పై కన్సర్ట్ చెయ్యటమే. ఈ వేదికపై ఆస్కార్ పురస్కార గ్రహీత ఎ.ఆర్.రహమాన్ స్వరపరిచిన వందేమాతరం పాటకు రెహమాన్ సమక్షంలో గొంతు కలిపి క్రిస్ మార్టిన్ భారతీయుల మనసులు కొల్లగొట్టాడు.
ఈ కన్సర్ట్ కు ప్రేక్షకులుగా విచ్చేసి క్రిస్ మార్టిన్ పాటలతో తమని తాము మైమరచిపోయిన వారిలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖులు ఎందరో వున్నారు. అయితే క్రిస్ మార్టిన్ మార్తియు ఆయన బృందాన్ని అతిధి సత్కారం కొరకై షారుఖ్ తన ఇంట్లో విందుకు ఆహ్వానించాడు. ఈ విందుకు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరై తెల్లవార్లూ ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులతో ముచ్చట్టించారు. షారుఖ్ విందుకి హాజరు ఐన వారిలో సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, హ్రితిక్ రోషన్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, శ్రద్ద కపూర్, ఫర్హాన్ అక్తర్, రానా దగ్గుబాటి వంటి పలువురు సెలబ్రిటీస్ వున్నారు.
Next Story

