కొణిదల vs నందమూరి

మార్చి 29న రెండు సినిమాలు రానున్నాయి అని తెలిసిందే. ఒకటి సుకుమార్ దర్శకుడిగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం మార్చి 29 న విడుదల చేస్తాం అని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం. ఇక దీనికి పోటీగా అలనాటి నటి సావిత్రి బయోపిక్ రానుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్టర్.
కానీ మహానటి నిర్మాతలు మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక వారం ఇటుగానో, అటుగానో మహానటిని విడుదల చేయాలని ఇప్పుడు మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇది తెలిసిన ఎమ్మెల్యే టీం.... రంగస్థలంకు పోటీగా వాళ్ళ సినిమా విడుదల చేయాలనీ డిసైడ్ అయింది. ఈ సినిమలో కొత్త డైరెక్టర్ ఉపేంద్ర ను పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎమ్మెల్యే సినిమా మార్చి 29 న విడుదల చెయ్యడానికిడిసైడ్ అయ్యిపోయారంట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ నటిస్తుంది. మూడు వంతులు పూర్తయిన ఈ సినిమా రఫ్ చూసుకున్నాక పూర్తి భరోసా రావడంతో ఈ సినిమా మార్చి 29 న విడుదలకు ఫిక్స్ చేసారని టాక్.
అంటే సమ్మర్ ప్రారంభంలోనే మెగా, నందమూరి హీరొల సినిమాలు ఢీ అంటే ఢీ అంటాయన్నమాట

