కొడుకు... తండ్రి దారిలో వెళ్లనంటున్నాడు

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన కె రాఘవేంద్ర రావు ఎప్పుడూ తనకి ఇష్టమైన భక్తి చిత్రాలను... అలాగే రక్తి చిత్రాలను మాత్రమే తెరకెక్కించేవాడు. ఎప్పుడూ కామెడీ ఎంటరైనర్ జోలికి గాని, అలాగే హార్రర్ జోనర్ ని నమ్ముకుని సినిమాలు చెయ్యాలేదనే చెప్పాలి. ఈ మధ్యన ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ.. భక్తికి రక్తి కి మధ్యలో ఉండడం తెలిసిందే. ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదనుకోండి అది వేరే విషయం. అయితే రాఘవేంద్ర కొడుకు ప్రకాష్ తన తండ్రిలా టాలెంటెడ్ డైరెక్టర్ కాకపోయినా ఆయన కూడా రెండు డిఫరెంట్ మూవీస్ ని తెరకెక్కించినవాడే.
కోవెలమూడి ప్రకాష్ ముందుగా ఫాంటసీ ట్రయ్ చేసినా.... ఆ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. కానీ ఆ రెండు సినిమాలు ప్లాపయ్యాయి. అందుకే ఈసారి ప్రకాష్ ఒక డిఫరెంట్ హర్రర్ కామెడీని ఎంచుకున్నాడట. శర్వానంద్ హీరోగా చేద్దామనుకుంటున్న చిత్రాన్ని ప్రకాష్ ఈ తరహా స్టైల్ లోనే తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడట. ప్రకాష్ - శర్వానంద్ కాంబినేషన్ లో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా కాస్త హర్రర్, సైకలాజికల్ సబ్జెక్ట్ తో ఫుల్ కామెడీతో తయారు చేయాలని ప్రకాష్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడనే టాక్ వినబడుతుంది.
అలాగే ఈ సినిమాని సుధీర్ - శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కన్నా ముందే ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీన్నిబట్టి కొడుకు ప్రకాష్ తండ్రి రాఘవేంద్ర రావు లా కాకుండా కాస్త కొత్తగానే ట్రై చేస్తూన్నాడని అంటున్నారు.

