Thu May 02 2024 09:00:57 GMT+0000 (Coordinated Universal Time)
కేవలం దానితోనే సరిపుచ్చేసాడు!!
బాహబలి మ్యానియా మొదలైపోయింది. వచ్చే ఏప్రిల్ లో సినిమా విడుదల అంటూ డేట్ కూడా ప్రకటించేసారు. ఇక ఈ సినిమా కి పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలైపోయాయి. అయితే బాహుబలి టీమ్ ఇంకా ఫస్ట్ టీజర్ ని ఇంతవరకు విడుదల చెయ్యలేదుగాని ఇప్పుడు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ప్రభాస్ పోస్టర్ నే కాకుండా ఒక మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇక బాహుబలి ది కంక్లూజన్ పోస్టర్ లో ప్రభాస్ ఏనుగు మీదకెక్కి దాని కుంభస్థలంపై తలపైకెత్తి నుంచున్న ఆ ఫోజ్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే బాహుబలి 1 తో సంచనాలను క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ తో ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బాహుబలి ది కంక్లూజన్ చిత్రం గ్రాఫిక్ వర్క్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా వుంది.
- Tags
- బాహుబలి
Next Story