కేథరిన్ ప్లేస్ లోకి కాజల్?

తమిళంలో హిట్ అయిన బోగన్ సినిమాని తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నాడని టాక్ ఉంది. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా సెట్ అయితే రవితేజ కి జోడిగా కేథరిన్ తెరిస్సా సెలెక్ట్ అయినట్లు వార్తలోచ్చాయి. ఇక రవితేజ - కేథరిన్ లు జంటగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి మొదలు పెడదామనుకున్న టైం లో ఇప్పుడు హీరోయిన్ విషయంలో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో కేథరిన్ ని తప్పించి మరో టాప్ హీరోయిన్ ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
అయితే కేథరిన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ... ఆమెకి మంచి హిట్స్ లేకపోవడం కారణమో మరొక విషయంలో తెలియదు గాని.. ప్రస్తుతానికి కేథరిన్ ని తప్పించేసి ఆమె స్థానంలోకి ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న కాజల్ ని తీసుకోవాలనే ప్లాన్ మేకర్స్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై హీరో రవితేజతో కూడా చర్చించినట్లుగా దీనికి రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ విషయమై కాజల్ తో మేకర్స్ చర్చిస్తున్నటుగా కూడా చెబుతున్నారు. ఇక కాజల్ ని ఎలాగైనా ఒప్పిస్తే ఈసినిమాకున్న క్రేజ్ మరింతగా పెరుగుతుందంటున్నారు.
ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఈ ఏడాది ఖైదీ నెంబర్ 150 తో, నేనే రాజు నేనే మంత్రి హిట్స్ తో సూపర్ ఫామ్ లోకొచ్చేసింది. అలాగే కాజల్, విజయ్ తో జోడికట్టిన అదిరింది చిత్రం కూడా రేపు దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ కి కాజల్ అగర్వాల్ ని తీసుకుంటే మంచి హైప్ వస్తుందని మేకర్స్ భావించి కేథరిన్ ని తప్పించి కాజల్ ని తీసుకుంటున్నారనే టాక్ వుంది. చూద్దాం ఫైనల్ గా తెలుగు బోగన్ లో హీరోయిన్ ఎవరనేది.

