కుదరదని చెప్పినా?

కొత్త సంవత్సరం వేడుకలకు సన్నీకి అనుమతి ఇవ్వం అని బెంగళూరు పోలీసులు చెప్పినా.... నిర్వాహకులు మాత్రం పెద్ద ఎత్తున టికెట్స్ విక్రయించారట. ఈ నెల 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు బెంగళూరులోని ఉద్యాన నగరిలో వున్న మాన్యత టెక్ పార్క్ వారు సన్నీ లియోన్ ను డాన్స్ చెయ్యడానికి పిలిచారు .మరి హాట్ భామ సన్నీ వస్తున్నదని తెలుసుకున్న కుర్రకారు టిక్కెట్లను ఎగబడి మరీ కొనేశారు.
మొదటినుంచి పోలీసులు అనుమతి ఇవ్వమని చెబుతున్నా నిర్వాహకులు మాత్రం కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఏర్పాట్లు భారీగా చేసుకున్నారు . కానీ పోలీసులు మాత్రం సన్నీ ప్రదర్శనకు ఎలాంటి పరిస్థితుల్లోను అనుమతి ఇవ్వమని ఖరాకండిగా చెప్పారు. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుశీల్ కుమార్ సన్నీ నైట్ కు అనుమతి నిరాకరిస్తున్నట్టు సోమవారం రాత్రి ప్రకటించాడు. మరి సన్నీ షో చూడాలని ఆశపడి ఎక్కువ డబ్బు ఇచ్చి టిక్కెట్లు కొన్నవారి పరిస్థితి ఊహించలేం . ఇక నిర్వాహకులు ఏంచేస్తారో మరి ?

