కుటుంబ పర్మిషన్ తోనే వచ్చానంటుంది

చిరంజీవి ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి కోకొల్లలుగా హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు.. టెక్నీకల్ గా కూడా పని చేసేవాళ్ళు ఉన్నారు. అందులో చిరంజీవి పెద్ద కూతురు తన తండ్రి చిరు సినిమాలకు అలాగే తమ్ముడు చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. సుష్మిత ఎప్పటినుండో ఈ రంగంలో ఉన్నా కూడా బాగా హైలెట్ అయ్యింది మాత్రం చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 తోనే. ఎందుకంటే ఈ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలోనే గొడవ జరిగి ఐటెం సాంగ్ చెయ్యాల్సిన కేథరిన్ ఆ సినిమా నుండి తప్పుకోవడం .. కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత వల్లననే అనే ప్రచారం బాగా జరిగి సుష్మత హైలెట్ అయ్యింది.
అసలు సుష్మిత ఈ సినిమా రంగంలోకి ఎలా, ఎందుకు వచ్చిందో అనే విషయాన్నీ ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. గతంలోనే అంటే సుష్మిత తన తండ్రి ఇంద్ర సినిమా చేసినప్పుడే ఆమె ఈ రంగంలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టింది. అప్పటినుండి అందరివాడు, శంకర్ దాదా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత తర్వాత పిల్లలు పుట్టడంతో గ్యాప్ తీసుకుని మళ్ళీ ఖైదీ నెంబర్ 150 కి, తన తమ్ముడు చరణ్ చేసిన ధృవ సినిమాలకు పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిందట. అయితే అలా పిల్లలు ఒక స్టేజ్ కి వచ్చాక మళ్ళీ ఈ రంగంలోకి కొనసాగే క్రమంలో తన అత్తామామలు, భర్త పర్మిషన్ తీసుకునే మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యిందట.
ఖైదీ నెంబర్ 150 సినిమాకి చరణ్... నాన్నకి డిజైనర్ గా చెయ్యమని అడిగినప్పటికే ముంబై నుండి వచ్చిన షబీనా ఖాన్ అనే హై ప్రొఫైల్ డిజైనర్ ఉన్నపటికీ ఆమెకి నాన్న డ్రెస్సింగ్ స్టైల్ గురించిన అవగాహన తక్కువ ఉండడంతో మళ్లీ నేనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చెయ్యాల్సి వచ్చింది అని చెబుతున్న చిరు పెద్ద కూతురు సుష్మిత ఇప్పుడు సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వస్తున్న రంగస్థలం మూవీ కి కూడా రామ్ చరణ్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. అలా రంగస్థలంలో షూటింగ్ లో దిగిన చరణ్, సుష్మితల పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

