కిస్ సీన్స్ లో యాక్ట్ చేయడానికి రెడీ

మొదటి సినిమాతోనే రాఘవేంద్రరావు లాంటి సీనియర్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించేసే ఛాన్స్ కోటేసింది తాప్సీ. ఝుమ్మంది నాదం సినిమా అప్పుడు ఎంత అమాయకంగా కనిపించిందో...ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళాక తన సినిమాలో కిస్ సీన్స్ ను తానే ప్రమోట్ చేసుకుంటుంది.
బాలీవుడ్ కి వెళ్లిన తాప్సీ అక్కడ వాతావరణంకి అలవాటు పడినట్టు వుంది. అక్కడికి వెళ్ళాక ఎక్సపోజింగ్ చేయటం..లిప్ కిస్సులు వున్న సీన్స్ లో నటించడం ఇలా చాలానే చేస్తుంది. అయితే లేటెస్ట్ గా దిల్ జుంగ్లీ అనే సినిమాలో నటించింది తాప్సీ. అందులో సాధిక్ సలీమ్ హీరోగా నటించాడు. ఆ సినిమాలో ఓ కిస్ సీన్ ఉంది. ఆ సీన్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది తాప్సీ. ఇలా ముద్దు సీన్ ను ప్రమోట్ చేస్తే జనాలు వస్తారన్న ఆశ పాపం తాప్సీది.
అలానే నేను ముద్దు సీన్లకు సిద్దమేనని సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా భావించవచ్చు. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 6నే విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజు రకుల్ ప్రీత్ సింగ్ అయ్యారి సినిమా విడుదల ఉండంతో మార్చి 9 కి ఈ సినిమాను వాయిదా వేశారు.

