కాస్త గ్యాప్ ఇస్తే మళ్లీ రెడీ అవుతా!

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్ లో ఒక వెలుగు వెలిగిన భామ... రకుల్ ప్రీత్ సింగ్. చిన్న, పెద్ద హీరోలతో వరసబెట్టి సినిమాలు చేసిన ఈ భామ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక వెలవెల బోతుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ తాకిడిని తట్టుకుని మరి నిలబడగలిగిన ఈ భామ స్పైడర్ దెబ్బకి బాగా డీలా పడింది. స్పైడర్ సినిమా తో మహేష్ తో మురుగదాస్ తో సినిమా చెయ్యాలనే కోరిక తీరడమే కాదు.. తమిళంలోనూ సూపర్ హిట్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ అమ్మడు స్పైడర్ తో బోర్లా పడింది. మరోవైపు ఖాకీ సినిమాతో కార్తీ తొ కలిసి హిట్ కొట్టింది. కానీ ఖాకీ సినిమాలో రకుల్ నటనకు బ్యాడ్ కామెంట్స్ పడ్డాయి.
రకుల్ ఉన్న సీన్స్ తొలిగిస్తే సినిమా ఇంకా బావుంటుందని ప్రచారమూ జరిగింది. అయితే రకుల్ ప్రీత్ ఈ మద్యన నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకోకుండా... కేవలం స్టార్ కాస్ట్ ని మాత్రమే చూసి సినిమాలు ఒప్పుకుంటుందని అంటున్నారు. ఆ ప్రశ్నకు రకుల్... దాదాపు నాలుగు సంవత్సరాల నుండి రాత్రిపగలు పనిచేస్తున్నాను. దాదాపు 10 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశాను. అందుకే ఈ ఏడాది చివరిలో కాస్త బ్రేక్ తీసుకోవాలని ముందే అనుకున్నాను. ఒకవేళ ఇలానే రెస్ట్ లేకుండా పనిచేస్తూ పొతే తొందరగా ముసలిదాన్ని అయిపోతాను. అందుకే కనీసం నెల రోజులు రెస్ట్ తీసుకుంటాను. అని చెబుతుంది.
ఇకపోతే సినిమాల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు లేవని... మనసుకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుంటున్నానని.. అలాగే ఒకేసారి మూడు నాలుగు స్టోరీలు నచ్చి సినిమాలు ఒప్పుకోకుండా కాస్త రెస్ట్ తీసుకుని సినిమాలు చెయ్యమని తన తల్లితండ్రులు తనకి సూచించారని చెబుతుంది. ఇకపోతే తన చేతిలో సినిమాలు లేవని ఎవరు చెప్పారని... తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని వాటికీ తాను కమిట్ అయ్యానని.. వచ్చే వేసవిలో ఆ రెండు సినిమాలు సెట్స్ మీదకెళతాయని... అప్పుడే అన్ని విషయాలు చెబుతానని కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసింది.

