కావాలనే విడిపోయారంట

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ ఒకడు. హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.... స్టార్ హీరో స్థాయిని మాత్రం అందుకోలేకపోయారు. సుమంత్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమా గా సత్యం మాత్రమే నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అసలు సుమంత్ కెరీర్ లో హిట్సే అనే పదానికే చోటు లేకుండా ఐపోయింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి రీసెంట్ గా మళ్ళీ రావా సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సుమంత్. మళ్ళీ రావా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ తన సిఎంమా విషయాలతో పాటే.. పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు.
అందులో భాగంగానే సుమంత్ ప్రేమ, పెళ్లి, విడాకుల విషయాలను కూడా బయటపెట్టాడు. తొలిప్రేమ హీరోయిన్ అయిన కీర్తీ రెడ్డి ని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుమంత్ . కాని అనుకోని విధంగా పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే సుమంత్ ఈ విడాకుల విషయం గురించి మాట్లాడుతూ... మేము ఇద్దరం కావాలనే అనుకోని విడిపోయాము. కలిసి ఉండలేము అని తెలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకొని మరీ విడిపోయాము. కీర్తి తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉందని అన్నాడు సుమంత్.
అయితే తన మాజీ భార్య కీర్తితో తాను ఇప్పటికీ టచ్ లో ఉన్నానని.... అప్పుడప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడుతుంటానని.... చివరగా తన తాత ఏఎన్నార్ చనిపోయినప్పుడు కీర్తి ఇక్కడికి వచ్చి వెళ్లిందని సుమంత్ తెలిపాడు. మరి సుమంత్ తో విడాకులు తీసుకున్న కీర్తి రెడ్డి మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయినా కూడా... సుమంత్ మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే వుండిపోయాడు.

