Thu Dec 18 2025 16:54:59 GMT+0000 (Coordinated Universal Time)
కావాలనే బెనిఫిట్ లాస్ అయిన మెగా హీరో

'ధ్రువ' చిత్రం డిసెంబర్ 9 న రిలీజ్ కి సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న 'ధ్రువ' చిత్రం పబ్లిసిటీ మీద దృష్టి పెట్టింది. పబ్లిసిటీలో దూసుకుపోతున్న ఈచిత్రం ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముస్తాబవుతోంది. 'ధ్రువ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరపడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ ఫంక్షన్ కి తెలంగాణ ఐటి మినిస్టర్ కేటీఆర్ స్పెషల్ గెస్ట్ గా హాజరవుతారని అనౌన్స్ కూడా చేసింది ధ్రువ టీమ్. వచ్చే శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనున్న ధ్రువ చిత్రానికి సంబందించి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పి రామ్ చరణ్ మెగా ఫాన్స్ ని నిరుత్సాహపరిచాడని అంటున్నారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ధ్రువ చిత్రానికి సంబంధించి బెన్ఫిట్ షోస్, మిడ్ నైట్ షోస్ ఉండవని చెప్పాడని సమాచారం.
రామ్ చరణ్ అలా ఎందుకు 'ధ్రువ' షోస్ ని మిడ్ నైట్ వెయ్యకుండా చేసాడో అని మెగా ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారట. అయితే రామ్ చరణ్ మాత్రం తెలివిగా ఆలోచించే ఈ పని చేసాడని అంటున్నారు. అదెలా అంటే పెద్ద సినిమాలును బెన్ఫిట్ షో లు వెయ్యడం పక్కా అనేది ఎప్పటినుండో వుంది. బెన్ ఫిట్ షో ల ద్వారానే చాలా సినిమాలు కలక్షన్స్ పరం గా రికవరీ అవుతుంటాయి. అయితే బెన్ ఫిట్ షో లు వెయ్యడం వల్ల తేడా కొట్టి తిరగబడిన సందర్భాలు చాలానే వున్నాయి. పెద్ద సినిమాలు బెన్ ఫిట్ షోస్ టాక్ వల్ల తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు వున్నాయి. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం వల్ల సినిమా ప్రొడ్యూసర్స్ కోలుకోలేని దెబ్బతిన్నవారు వున్నారు.
అందుకే చరణ్ తన ధ్రువ చిత్రానికి బెన్ ఫిట్ షోస్ వేసి ఎలాంటి గందరగోళం జరగకుండా ముందే జాగ్రత్త పడి ఈ స్పెషల్ షోస్ ని, బెన్ ఫిట్ షో ని క్యాన్సిల్ చేసి పడేసాడు. మరి మామ అల్లు అరవింద్ కూడా చరణ్ నిర్ణయాన్ని సమర్ధించినట్లు వార్తలొస్తున్నాయి.
Next Story

