కావాలనే తప్పుకున్నా... కానీ 'నో కామెంట్'!!

గోపీచంద్ హీరోగా వచ్చిన 'గౌతమ్ నందా' చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా అందచందాల ఆరబోతలో మితిమీరిన కేథరిన్ తెరిస్సా ఇప్పుడు తాజాగా... 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ గా, మోడరన్ గర్ల్ గా చెలరేగి పోనుంది. ఈ చిత్రం ఆగష్టు 11 న విడుదలకు సిద్ధంగా వుంది. ఇకపోతే కేథరిన్ ఐటెం సాంగ్లో అదరగొట్టడానికి కూడా రెడీ అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న ,జయ జానకి నాయక, చిత్రంలో కేథరిన్ స్పెషల్ సాంగ్ తో రెచ్చిపోనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ కేథరిన్ అందచందాలతో రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే కేథరిన్ కి ఇంతకుముందే ఐటెం సాంగ్ లో చేసే అవకాశం వచ్చింది. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' లో కేథరిన్ కి ఐటెం ఛాన్స్ రావడం.... అది అమ్మడు ఒప్పుకోవడము.... సాంగ్ కోసం రెడీ అవడము చక చకా జరిగిపోయాయి. కానీ సెట్స్ కు వెళ్లే టైంకు కేథరిన్ కి ఆ సాంగ్ లో రచ్చ చేసే అవకాశం లేకుండా పోయింది. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది కూడా... కాకపోతే చిరు కూతురు సుస్మితతో రిహార్సల్స్ లో వచ్చిన విభేదాల వలన ఖైదీ..... ఐటెం లో కేథరిన్ నటించకుండా బయటికి వెళ్లిపోయిందనే టాక్ అప్పట్లో వినిపించింది.
అయితే ఆ విషయంపై ఇప్పుడు తాజాగా కేథరిన్ ఒక ఇంటర్వ్యూ లో స్పందించింది. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో మిస్సింగ్ ను ఒప్పుకుంది. అలాగే 'ఖైదీ...' మూవీ నుండి నేనే తప్పుకున్నానన్న కేథరిన్....... సుశ్మితతో కాస్ట్యూమ్ ఇష్యూ పై 'నో కామెంట్' అంటూ లౌక్యాన్ని ప్రదర్శించింది. సెట్స్ లో ఇప్పటి హీరోయిన్స్ లా ఎప్పుడు లౌక్యంగా ఉండదనే పేరున్న కేథరిన్ కెరీర్ ఎలా ఉండబోతున్న విషయం ఇప్పుడు విడుదలవుతున్న 'నేనే రాజు - నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాలు డిసైడ్ చేస్తాయంటున్నారు.

