కాలా టీజర్ యూట్యూబ్ రికార్డ్ కష్టమే

సూపర్ స్టార్ రజిని 'కాలా' సినిమా టీజర్ మార్చి 1న రిలీజవుతుందని ముందు ప్రకటించారు. కానీ ముందు రోజు జయేంద్ర సరస్వతి మరణంతో టీజర్ లాంచ్ వాయిదా పడింది. మార్చి 2న టీజర్ విడుదల చేస్తాం అని ధనుష్ తన అకౌంట్ లో పోస్ట్ చేసాడు. కానీ గురువారం నైట్ చడీచప్పుడు లేకుండా టీజర్ ట్విట్టర్లోకి వదిలేశాడు నిర్మాత ధనుష్.
ఇలా ఎందుకు రిలీజ్ చేసారో అర్ధం కానీ విషయం. కానీ అసలు విషయం ఏంటంటే.. టీజర్ ను ధనుష్ రిలీజ్ చేయకుండా లీక్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని నెట్లో ఈ టీజర్ లీకైపోయింది. పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల్లో టీజర్ కనిపించింది. దీంతో షాక్ తిన్న నిర్మాత ధనుష్ చేసేది ఏమిలేక తన ట్విట్టర్ అకౌంట్ లో నిన్న నైట్ 'కాలా' టీజర్ ను రిలీజ్ చేసాడు.
ఉదయం టీజర్ ను రిలీజ్ చేసినట్లయితే ఆ హుంగామ వేరుగా ఉండేది. అర్థరాత్రి రిలీజ్ చేయటంతో ఎవరికి తెలీదు. ఉదయం రిలీజ్ చేసివుంటే ఫ్యాన్స్ రెడీగా ఉండేవారు. తక్కువ టైంలోనే మిలియన్ మార్క్ అంటూ హంగామా చేసేవాళ్లు. కానీ ఆలా జరగలేదు. ఇక ఈ టీజర్ విషయంలో జనాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రజిని స్టైల్.. తన మార్క్ డైలాగులకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నపటికీ.. కొత్తగా ఏమి లేదు 'కబాలి' సీక్వెల్ లా వుంది అని అంటున్నారు.

