కాపీ కొట్టలేదంటలే..!!

మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహానుభావుడు విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ చిత్రం ఓసిడి అనే డిజాస్టర్ అంటే అతి శుభ్రం అనే మానసిక వ్యాధితో బాధపడే వ్యక్తి వలన ఎదుటి వారికి కలిగే నష్టాలూ.... అదే వ్యాధి వలన జీవితంలో తానేం కోల్పుతున్నాడో అనే దాని చుట్టూ అల్లిన కథే. అదే కథతో కొద్దిగా కామెడీని మిక్స్ చేసి మారుతీ ఈ మహానుభావుడు సినిమాని తెరకెక్కించాడు.
మళయాళ సినిమా కాపీయా?
అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడే ఈ సినిమా మలయాళం లోని ఒక సినిమాని రీమేక్ చేసినట్లు ఉందని.... కాదు కాదు ఆ సినిమాని కాపీ కొట్టేశాడనే ప్రచారం జరిగింది. ఇక సినిమా మొత్తం మలయాళ సినిమా లాగే ఉంటుందనే ప్రచారం గట్టిగానేజరిగింది. అయితే మహానుభావుడు ప్రమోషన్స్ లో దర్శకుడు మారుతీ ఈ సినిమా ఏ సినిమాకి రీమేక్ కాదని.. అలాగే ఫ్రీమేక్ కూడా కాదని కూడా చెబుతున్నాడు. అయితే ఓసిడి అనే కాన్సెప్ట్ ఇంకో సినిమాలో ఉన్నంత మాత్రాన ఆ కాన్సెప్ట్ నే కాపీ కొట్టేసినట్లు కాదని మారుతి అంటున్నాడు. అసలు వరల్డ్ వైడ్ గా ఓసీడీ డిజార్డర్ నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయని....నా మదిలో ఓసిడి కాన్సెప్ట్ తో సినిమా తీయాలనుకున్నప్పుడే ఆ సినిమాలన్నీ చూశానని... అయితే ఆ చూసిన సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఈ మహానుభావుడులో ఉండొచ్చని... అంతేగాని ఏ సినిమా నుండి నేను ఈ సినిమాని కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చుకున్నాడు.
- Tags
- మహానుభావుడు

