కాజల్ మనసులో మాట

టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ఒక్కప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే గత కొంత కాలం నుండి కాజల్ ఫామ్ ని కోల్పోయింది. ఈ మధ్య మళ్లీ ఫామ్ లోకి వచ్చి అ! సినిమాలో వైవిధ్యమైన పాత్ర చేసింది. ఈ సినిమాలో కాజల్ పాత్ర విమర్శకులను సైతం మెప్పించింది.
"ఈ పాత్ర కోసం చాలానే కష్టపడ్డానని చెప్పుకొచ్చింది కాజల్. ఇందులో ఆమెది మానసికంగా స్థిరత్వం లేని పాత్ర. ఈ పాత్ర కోసం నాకు తెలిసిన సైకాలజిస్టును కూడా కలిసి సలహాలు తీసుకున్న. మానసికంగా దెబ్బ తిన్నవారు ఎలా ఉంటారో..బయట వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అన్నదానిపైనే స్టడీ చేశా అని చెప్పింది.
ఈ సినిమాలో అందరి పాత్రల కన్నా నా పాత్ర అందరికి బాగా నచ్చింది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది’అని చెప్పుకొచ్చింది కాజల్. మనకు కొత్తగా ఆలోచించే డైరెక్టర్స్ చాలా అవసరం. అ! అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. హిందీలో రాణించలేకపోతున్నానని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సౌత్ లో హీరోయిన్ గా నేనున్న స్థానం నాకెప్పుడూ ప్రత్యేకమే". అని చెప్పుకొచ్చింది కాజల్.

