కాజల్ ఆ సినిమాకి నో చెప్పేసింది

'నేనే రాజు నేనే మంత్రి' హిట్ తర్వాత దర్శకుడు తేజ వెంకటేష్ కోసం ఓ సబ్జెక్టు రెడీ చేసి సెట్స్ పైకి కూడా తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి ఈ సినిమాకి హీరోయిన్ కాజల్ అని కూడా అనేసుకున్నారు. దీనికి కాజల్ కూడా ఒకే చెప్పిందని సెట్స్ మీదకి సినిమా వెళ్లటమే ఆలస్యం అని అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది..
అదేటంటే కాజల్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకని ఆరా తీస్తే..రెమ్యేనరేషన్ భారీగా అడిగిందని తెలుస్తుంది. అయితే వేరే ఆప్షన్ కూడా పెట్టుకున్నాడు తేజ. కాజల్ కాకపోతే తమన్నా అనుకుని సంప్రదించాడు. అయితే తమన్నా కూడా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీరిద్దరూ ప్రస్తుతం పెద్దగా బిజీగా ఏమీ లేరు. తమన్నా అయితే డేట్స్ లేవని బిల్డప్ ఇచ్చేసి సినిమా వదులుకుందట.
వెంకటేష్ సీనియర్ హీరో కాబట్టి ఆయన పక్కన చేస్తే అంత పేరు రాదని వీరిద్దరూ ఈ సినిమా వదులుకునట్టు తెలుస్తుంది. వెంకటేష్ కి సెట్ అయ్యే హీరోయిన్ ని ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకోవాలని తేజ చాలా ఆలోచిస్తున్నాడట.

