కళ్యాణ్ రామ్ ఎమ్యెల్యే మొదటి రోజు కలెక్షన్స్

కళ్యాణ్ రామ్ - కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన ఎమ్యెల్యే నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. గత నెల రోజులుగా థియేటర్స్ లో సరైన సినిమా లేకపోవడంతో ఎమ్యెల్యే కి బాగా కలిసొచ్చిన అంశం. మంచి లక్షణాలున్న అబ్బాయి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఈ ఎమ్యెల్యేతో వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ న్యూ లుక్, కాజల్ అందాలు బాగా ప్లస్ అయ్యాయి.
కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తెరకేకించిన ఈ సినిమాలో కొత్తదనం లేకపోయినా ఈ సినిమాకి ఇంతటి మంచి ఓపెనింగ్స్ రావడం మాత్రం కళ్యాణ్ రామ్ స్టయిల్ అండ్ కాజల్ గ్లామరే కారణం అంటున్నారు జనాలు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఎమ్యెల్యే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 5.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి కళ్యాణ్ రామ్ స్టామినాని తెలియజేసింది. మొదటిరోజునే ఎమ్యెల్యే నైజాం లో 86 లక్షలకి పైగా వసూలు చెయ్యడమే కాదు .. సీడెడ్ లోను 51 లక్షలకి పైగా వసూలు చేసింది.. మరి ఈ కలెక్షన్స్ కల్యాణ్ రామ్ కెరియర్లోనే బెస్ట్ కలెక్షస్న్అంటున్నారు.
మొదటి రోజు బాగానే రాబట్టిన కళ్యాణ్ రామ్ ఈ వీకెండ్ లోను ఇదే జోరు చూపిస్తే బయ్యర్లు గట్టెక్కుతారంటున్నారు. మంచి ప్రమోషన్స్ వలన ఎమ్యెల్యేకి ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయంటున్నారు. అయితే కళ్యాణ్ రామ్ కి పోటీగా థియేటర్లులోకి వచ్చిన శ్రీ విష్ణు నీది నాది ఒకే కథ సినిమా కి సరైన ప్రమోషన్స్ లేక సినిమాకి హిట్ టాక్ అండ్ సూపర్ రివ్యూస్ వచ్చిన కలెక్షన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయంటున్నారు.

