కలవరించారుగా... ఇప్పుడు చూడండి!!

పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి.. తన అందంతోనే ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసే శ్రీదేవి ఎంతో మందికి అభిమాన తార.. అంతటి నటీమణి నటనకు స్వస్తి చెప్పి బాలీవుడ్ దర్శకనిర్మాత అయినా బోనీ కపూర్ ను వివాహమాడింది. ఈమధ్యన మళ్ళీ తిరిగి తెరపై రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇప్పుడు అడపాదడపా నటిస్తూనే ఉంది.
జాన్వీ ఎంట్రీ....
అయితే ఇప్పుడు శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ తెరకు పరిచయం కానుంది. గత మూడునాలుగేళ్లనుండి జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు వెండితెరకు పరిచయమా వుంటుందా అని దేశమంతా ఎదురు చూస్తూ కూర్చుంది. అయితే ఇన్నాళ్లకు జాన్వీ బాలీవుడ్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ ....
బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్.. జాన్వీ కపూర్ ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. జాన్వీ కపూర్ సినిమాలకు పరిచయమవుతున్న మొదటి చిత్ర ‘ధఢక్’ అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు సాయంత్రం ట్విట్టర్ ద్వారా నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశాడు. జాహ్నవి సరసన ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. శశాంక్ ఖైతన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్ జోహార్, జీ స్టూడియోస్ , అపూర్వ మెహతా, హిరూ యాష్ జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం జులై 6, 2018న విడుదల కానుంది.
- Tags
- జాన్వీ కపూర్

