కమెడియన్ పై కక్ష కట్టిన ఆ నిర్మాత ఎవరు...?

కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకొని 'కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్గ్ఎహే' వంటి వరస ప్లాప్ చిత్రాలు చేస్తున్న సునీల్‌పై టాలీవుడ్‌కి చెందిన ఓ అగ్రనిర్మాత కక్ష్యకట్టాడంటూ టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆయన సునీల్ నటిస్తున్న చిత్రాల శాటిలైట్ రైట్స్‌ను ఏ ఛానెల్ వారు తీసుకోకుండా చేస్తున్నాడని, అదే సమయంలో ఆయన నటించిన చిత్రాలకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేయడం, ఆయన చిత్రాల విడుదల సమయంలో టివి చానెల్స్, ఎఫ్ఎం రేడియో వంటి ప్రచార సాధనాల యజమానులకు ఫోన్ చేసి మరీ ఆ చిత్రాలకు ఎక్కువ పబ్లిసిటీ రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
ఈ విషయం తెలిసిన వారు మాత్రం సునీల్‌ను చూసి పాపం.. సునీల్. ఆ నిర్మాత.. సునీల్ అంతు చూడందే వదలడులా ఉంది.. అంటూ జాలి చూపిస్తున్నారట. ఆ నిర్మాత టాలీవుడ్‌నే శాసించగలిగే ఓ బడా నిర్మాత కావడంతో ఈ విషయమై సునీల్గానీ,ఇతరులు కానీ ఏమీ అనలేని, ఏమి చేయలేని పరిస్థితి తలెత్తుతోందని సునీల్ సన్నిహితులు వాపోతున్నారు. మరి సునీల్ జీవితం ఎప్పుడు ఒడ్డుకు చేరుతుందో వేచిచూడాల్సివుంది.

