కమల్ కి రజిని కౌంటర్ వేశాడా?

ఇప్పుడు తమిళనాట సినిమా రాజకీయాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్దమంటూ వార్తలొస్తాయి. కానీ మధ్యలో అవి గాలి వార్తలంటూ కొట్టిపడేస్తారు. తర్వాత రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టే బిల్డప్ ఇస్తాడు... కానీ రాడు. మరో వైపు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ కోసం కాసుక్కూర్చున్నాడు. మరో రెండు నెలల్లో కమల్ కొత్త పార్టీ పెడతాడని వార్తలు వస్తూనే వున్నాయి. కానీ ఇక్కడ రజినీకాంత్ కి కమల్ హాసన్ కి కోల్డ్ వార్ జరుగుతుంది అనేది వాస్తవం. వారిద్దరూ మంచి మిత్రులు... కానీ రాజకీయాలవలన శత్రువులుగా మారిపోయారు.
అందుకే ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా తాజాగా రజినీకాంత్, కమల్ మీద ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసాడు. తమిళనాట ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మెమోరియల్ స్మారక మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. అయితే సినిమా ప్రముఖుల్లో రజినీకాంత్, కమల్ హాసన్, విశాల్, కార్తీలు హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హసన్ ఇద్దరూ కలిసి ఇలా ఒకే వేదిక మీదకి రావడం అక్కడ చూపరులను బాగా ఆకర్షించడమే కాదు హాట్ టాపిక్ అయ్యింది.
ఈ కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడుతూ కమల్ కి ఇండైరెక్ట్ కౌంటర్ విసిరాడు. అదేమిటంటే రాజకీయాల్లోకి రావాలంటే కీర్తి ప్రతిష్టలు ఒక్కటే సరిపోవని.... ఇంకేదో కావాలని అన్నారు. అదేంటో ప్రజలకు తెలుసు. నాకు మాత్రం తెలియదు.. బహుశా కమల్‌కు తెలుసనుకుంటా.. అంటూ అక్కడే ఉన్న కమల్ ని చూస్తూ మాట్లాడడం ఇప్పుడు హాట్ హాట్ చర్చలకు దారి తీసింది. అయితే ఇలా రజినీకాంత్ మాత్రం... కమల్ ఈ మధ్య కొత్త పార్టీ పెడతానని చెప్పడం.. ఆ వెనువెంటనే అవసరమైతే బీజేపీ నీడన చేరుతానంటూ సంకేతాలు పంపడం... నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసాడేమో అంటున్నారు. చూద్దాం ఈ కౌంటర్ ని కమల్ ఎలా తీసుకుంటాడో అనేది!

