కథానాయికల విశాల హృదయం

ఈ కాలం కొంతమంది హీరో, హీరోయిన్స్ ఎంత డబ్బు సంపాదించాం దానిలో ఎంత ఖర్చు చేస్తున్నాం అని అన్నమాటే గాని.... సంపాదించిన డబ్బునుండి కొంత పేద వాళ్ళకి ఖర్చు పెడదాం అన్న ధ్యాసే లేదు. కానీ కొంతమంది హీరో, హీరోయిన్స్ అలా కాదు... తాము సంపాదించిన మొత్తం లో కొంత ఏ సేవా సంఘాలకో లేక అనాధ పిల్లల్ని చదివించడానికో, అనాధాశ్రమాలకు కొంత డబ్బు దానం చేస్తూ తన దన గుణాన్ని చాటుకుంటున్నారు. హీరోయిన్స్ లో అయితే సమంత తాను సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటినుండి ప్రత్యుష ఫౌండేషన్ కి తన వంతు సహాయం అందిస్తూ అందరికి ఆదర్శం గా నిలుస్తుంది.
ఇక కొంతమంది అయితే తమ పుట్టిన రోజు వేడుకల్ని అనాధ పిల్ల ల మధ్యలో జరుపుకుని వారికి స్వీట్స్, పళ్ళు వంటివి పంచి వారికి ఆనందాన్నిస్తారు. ఇక ఇప్పుడు హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఇదే దారిలో నడుస్తుంది. రాశి ఖన్నా నిన్న దీపావళి పండగని ఎయిడ్స్ బాధిత చిన్నారుల మధ్యలో జరుపుకుని వారికి కొత్త ఉత్సాహాన్నిఇచ్చింది. రాశి ఐడీఏబొల్లారంలోని ఎయిడ్స్ బాధిత చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంది. ఎయిడ్స్ బాధిత చిన్నారులతో కలిసి ఆమె టపాకాయలు కాల్చి ఆడిపాడింది. ఆమె ఆట పాటతో అక్కడి వారి మోముల్లో నవ్వులు విరియడంలో ఆశ్చర్యం ఏముంది.

