కథ మీదున్న నమ్మకమే... లెట్ అయినా ఓకె అంటున్నాడు

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ అజ్ఞాతవాసి అనేది దాదాపు ఫిక్స్ అయినట్టే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు అజ్ఞాతవాసి టైటిల్ ని రిజిస్టర్ చేయించడమే అలా జనాలు ఫిక్స్ అవడానికి కారణం. ఇక దీపావళి కానుకగా పవన్ PSPK 25 టైటిల్ ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. ఇక ఈ చిత్ర కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా డబ్బున్న వ్యక్తి అయినప్పటికీ కొన్ని కారణాలతో కుటుంబానికి తన ఊరికి దూరంగా అజ్ఞాతంలో గడుపుతుంటాడట. తన ఐడెంటిని కూడా మార్చుకుని ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలో గడిపే వ్యక్తి కథే అజ్ఞాతవాసి కథ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కథ వినడానికి సాఫ్ట్ గా స్మూత్ గా ఉన్న ఈ సినిమా మొత్తం యాక్షన్ తోనే ఉంటుందట. అసలు పవన్ కళ్యాణ్ లోని హీరోయిజాన్ని ఎవరూ చూపెట్టని విధంగా త్రివిక్రమ్ ఏ ఈసినిమాలో పవన్ హీరోయిజాన్ని చూపించబోతున్నాడని టాక్. గతంలో రజినీకాంత్ భాష సినిమా లెవల్లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అంటున్నారు. ఎమోషన్ సన్నివేశాలకు, మాస్ ఎలిమెంట్స్ కి అసలు లోటు ఉండదని అంటున్నారు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ కి కథ మీదున్న నమ్మకంతోనే... సినిమా షూటింగ్ లేట్ అవుతున్నా పెద్దగా వర్రీ కావడంలేదని అంటున్నారు.
ఆ నమ్మకంతోనే సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉన్నపటికీ అదరకుండా బెదరకుండా విడుదల చేస్తున్నారట. జనవరి 10 నే తమ విడుదల చేస్తున్న ఈ మూవీ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పక్కన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తుండగా.. ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి లు కీ రోల్స్ పోషిస్తున్నారు.

