కట్ చేసి.. సారీ అన్నాడా?

గత రెండు రోజులుగా నటి మెహ్రీన్ కౌర్ తాజాగా నటించిన సన్నాఫ్ సూర్య సినిమా గురించిన వార్తలే ఎక్కువగా మీడియాలో వినబడుతున్నాయి. సన్నాఫ్ సూర్య సినిమా గత శుక్రవారమే విడుదలై మిశ్రమ స్పందనతో థియేటర్స్ లో రన్ అవుతుంది. సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ - మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కిన ఈసినిమాపై మెహ్రీన్ భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటికే హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న ఈ భామ ఈ సినిమాతో కూడా విజయనాన్ని సొంతం చేసుకోవాలనుకుంది. కానీ మెహ్రీన్ కి సన్నాఫ్ సూర్య చిత్ర దర్శకుడు భారీ షాకిచ్చాడు.
సీన్లకు కోత....
సన్నాఫ్ సూర్య సినిమా నిడివి తగ్గించే విషయంలో నటి మెహ్రీన్ ఉన్న సన్నివేశాలకు కోత పెట్టాడు. సన్నాఫ్ లో మెహ్రీన్ ఉన్న చాలా సీన్స్ ని తొలగించడంతో మెహ్రీన్ బాగా హార్ట్ అయ్యింది. మరి ఒక సినిమాలో సీన్స్ లేపెయ్యల్సి వస్తే ఏ కామెడీ సీన్స్ ఏమన్నా లేపేస్తారు గాని ఇలా హీరోయిన్ ఉన్న సీన్స్ లేపేస్తే హీరోయిన్స్ ఇలానే బాధపడతారు. మరి ఏ హీరోయిన్ కూడా తమ సినిమాలకు చెయ్యని ప్రమోషన్ ని మెహ్రీన్ తాను నటించిన సినిమాలకు చేస్తుంది. మరి అంతలా సినిమా మీద ఆశలు పెట్టుకున్న మెహ్రీన్ కి ఇలా తన సీన్స్ కట్ చేస్తే బాధ కలగదు.
హీరోయిన్ పెద్ద మైనస్సా...
అయితే కేరాఫ్ సూర్య సీన్స్ ని తొలగించడంపై.. అందులోను మెహ్రీన్ సీన్స్ లేపెయ్యడంపై దర్శకుడు సుశీంద్రన్ ఇప్పుడు మెహ్రీన్ కి సారి చెబుతున్నాడు. మరి ఇలా సీన్స్ కట్ చేసేసి సారి అంటే సరిపోతుందా.. అంటున్నారు మెహ్రీన్ అభిమానులు. ఇకపోతే ఇలా హీరోయిన్ సీన్స్ సినిమాలో లేపేసి సన్నాఫ్ సూర్య సినిమాకి హీరోయిన్ పెద్ద మైనస్ అన్న విషయం దర్శకుడు చెప్పకనే చెప్పేసినట్టు అయ్యింది.
- Tags
- కేరాఫ్ సూర్య

