ఓవర్ సీస్ హక్కులు కోరుతున్న డైరెక్టర్

దర్శక రచయిత కొరటాల శివ దర్శకుడిగా మారి చేసినవి మూడే చిత్రాలు అయినప్పటికీ ఆయన అగ్ర దర్శకుల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఆయన చేసిన మూడు చిత్రాల హీరోలకు ఆయా చిత్రాలు వారి ట్రాక్ రికార్డ్స్ కావటం ఒక కారణం కాగా, తెలుగు చిత్ర పరిశ్రమలోని అధిక వసూళ్లు రాబట్టిన మొదటి మూడు చిత్రాలలో కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు రెండవ స్థానంలో, జనతా గ్యారేజ్ మూడవ స్థానం లో నిలవటం మరొక కారణం. ఈ లెక్కలు అన్నీ పక్కన పెడితే కొరటాల శివ తాను నమ్మి రాసుకున్న కథను ప్రేమించి ఆ కథను ప్రేక్షకులకు చెప్తుంటాడు.
అందుకే కొరటాల శివ కి తన నాలుగవ చిత్రంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో సారి పని చేసే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఆయన అన్నీ విధాలా సద్వినియోగ పరుచుకుంటున్నారు. శ్రీమంతుడు కన్నా బలమైన కథను సిద్ధం చేసుకుని చిత్ర ప్రారంభోత్సవం జరిపారు. తన పారితోషికాన్ని 13 కోట్ల రూపాయలుగా నిర్మాతలు ఒప్పొందం చేసుకోవటానికి ముందుకు రాగా, కొరటాల శివ ఓవర్ సీస్ చిత్ర విడుదల హక్కులను ఆశిస్తున్నట్లు సమాచారం. విజయాపజయాలకు అతీతంగా ఓవర్ సీస్ మార్కెట్ వుండే ఏకైక తెలుగు హీరో మహేష్ బాబు. ఆయన చిత్రాలు మోస్తరు ప్రేక్షకాధరణతో కూడా ఓవర్ సీస్లో 15 కోట్ల రూపాయలు సాధిస్తుంటాయి. మరి నిర్మాతలు కొరటాల శివ కోరిక మేరకు ఒప్పందం జరుపుతారో లేదో చూడాలి.

