ఒక్కడి వల్ల కోట్లు నష్టం!!

మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మలయాళ హీరో దిలీప్ అక్కడ పెద్ద స్టార్ హీరో. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్స్ తర్వాతి స్థానంలో ఈ దిలీప్ కుమార్ ఉన్నాడంటే అతను ఎంత పెద్ద హోదాలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ హీరో చాలా చీప్ గా ఒక హీరోయిన్ ని కిరాయి గుండాలను పెట్టి కిడ్నాప్ చేయించాలనుకోవడం... దాని కోసం కోటిన్నర ఖర్చు పెట్టడం చూస్తుంటే అతనెంత దిగజారిపోయి ప్రవర్తించాడో అర్ధమవుతుంది. ఆ దిగజారుడు తనానికి ఇప్పుడు తగిన శిక్ష అనుభవించడానికి రెడీ అయ్యాడు. గత ఆరునెలలుగా పోలీస్ లకు దొరక్కుండా తప్పించుకున్న దిలీప్ ఎట్టకేలకు పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అయితే ఇప్పుడు దిలీప్ అరెస్ట్ తో మలయాళ ఇండస్ట్రీకి కోట్లలో నష్టం వచ్చిందంటున్నారు. దిలీప్ సినిమాలు కొన్ని షూటింగ్ మధ్యలో ఉండగా.... దిలీప్ నటించిన రాంలీలా ఈ నెల 21 న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు దిలీప్ అరెస్ట్ తో ఆ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. అలాగే దిలీప్ నటించిన రాంలీలా మూవీ కూడా ఈ నెల 21 విడుదల కౌకండా పోస్ట్ ఫోన్ వడంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. కేవలం దిలీప్ అరెస్ట్ వల్ల 60 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.
అలాగే దిలీప్ ని మాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పించాలంటూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. మరి భావన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఈ దిలీప్ కుమార్ వలన మలయాళ ఇండస్ట్రీ అతలాకుతలం అయ్యిందంటున్నారు.

