ఒకే ఫ్రెములో చిట్టిబాబు.. రామలక్ష్మి?

మరొక్క 20 రోజుల్లో ప్రేక్షకులముందుకు రాబోతున్న రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం గురించిన ముచ్చట్లే ఎక్కడ చూసినా... ఎక్కడ విన్నా కూడా..... మార్చ్ 30 న విడుదలకానున్న రంగస్థలం హంగామా మార్కెట్ లో మాములుగా లేదు. ఇప్పటికే రెండు సింగిల్స్ తో పాటే... చిట్టిబాబు ఉరఫ్ రామ్ చరణ్ టీజర్, రామలక్ష్మి ఉరఫ్ సమంత ల టీజర్స్ హంగామా అలా ఇలా లేదు. చిట్టి బాబు గా సౌండ్ ఇంజినీర్ గా చరణ్ అదరగొట్టేస్తే... చరణ్ కన్నా అమాయకపు పల్లె పడుచులా సమంత రామ లక్ష్మి లుక్ లో ఇరగదీసింది. పాతకాలపు ప్రేమ కదా అందుకే వాళ్ళ లుక్స్ ఆనాటి కాలంతో పాటు ఆనాటి పల్లెటూరి పద్దతులను, ఆనాటి వాతావరణాన్ని కూడా సుకుమార్ ఎంతో అందంగా ఈ సినిమాలో చూపించనున్నాడు.

మరి ఇప్పటివరకు రామలక్ష్మి, చిట్టిబాబులు విడివిడిగానే సందడి చేశారు. అలాగే రంగస్థలం సింగిల్స్ లో సైతం చిట్టి బాబు ని, రామలక్ష్మి ని ఒక చోటా అంటే ఒకే ఫ్రెములో ఇంతవరకు చూపెట్టలేదు. కానీ ఇప్పుడు వదిలిన ఒక పోస్టర్ లో రామ లక్ష్మి అండ్ చిట్టిబాబు లను అలా చూస్తుంటే చూడముచ్చటగా కనిపిస్తున్నారు. రేపు గురువారం రంగమ్మ.... మంగమ్మ అనే సింగిల్ ని వదుల్తామని తెలిపే పోస్టర్ లో రామ లక్ష్మి, చిట్టిబాబుల కోపతాపాలు చూపించారు. మరి ఆనాటి పల్లె వాతారవనంలోని గొడుగులు తాటేకులతో అల్లేవారు. ఇప్పుడు రామలక్ష్మి కూడా చిట్టిబాబు చేతిలోని తాటేకుల గొడుగుని లాగుతూ సరసమాడుతుంటే... చిట్టిబాబు మాత్రం తెచ్చిపెట్టుకున్న కోపంతో రామలక్ష్మి మీద చిర్రుబుర్రులాడుతున్నట్టుగా ఉన్న ఈ రంగస్థలం పోస్టర్ మాములుగా లేదు. మరి రామలక్ష్మి, చిట్టిబాబులు ఒకే ఫ్రెములో ఉన్న ఆ పోస్టర్ మీద మీరు ఓ లుక్కేయండి.

