Sun Dec 21 2025 22:16:16 GMT+0000 (Coordinated Universal Time)
ఏమైంది తల్లి ఇలా మాట్లాడావ్!!

సమంత, నాగ చైతన్య వచ్చే సంవత్సరం ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నారు. పాపం నాగ చైతన్యతో పెళ్లి పుణ్యమా అని తెలుగులో ఏం సినిమాలు ఒప్పుకోకుండా అలా అలా ఖాళీగా ఉండిపోయింది. కానీ ఏమనుకుందో ఏమో గాని తమిళం లో మాత్రం రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది. ఇక సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ మధ్యనే ఇంస్టాగ్రామ్ లో కూడా అడుగుపెట్టిన సమంత ఒక పక్క పేస్ బుక్ లో మరో పక్క ట్విట్టర్ లో కూడా బాగా ఆక్టివ్ గా మారింది. ఇక తన గురుంచి, చైతు గురించి చెప్పి చెప్పనట్లు పోస్ట్ లు చేస్తూ అభిమానులను ఊరిస్తుంటుంది.
అయితే ఇప్పుడు సమంత తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేసింది. అది చూసిన వారు అదేమిటి సమంత ఇలా అనేసింది అని అంటున్నారు. అసలు సమంత ఏమందంటే . ఒక్కోసారి... మనం బతికి ఉన్నందుకే సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది అని పోస్ట్ చేసింది. ఇక దీనర్ధం కొన్ని కొన్ని సార్లు మనం బతికే ఉన్నాం అనే ఒకేఒక్క కారణంతో చాలా ఆనందంగా ఉండాల్సి వస్తుంది అన్నమాట. అసలు సమంత ఇలా ఎందుకంది. అంత వైరాగ్యం ఎందుకొచ్చింది. నాగ చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని బాగానే వుంది. ఇంకోపక్క షాప్ ఓపినింగ్స్ అంటూ తెగ హడా విడి చేస్తుంది. మరలా హ్యాపీగా ఉంటున్న టైం లో అసలు సమంత ఇలా ఎందుకు ట్వీట్ చేసిందనే అయోమయం లో సమంత ఫాన్స్ పడిపోయారు.
అసలు సమంత అలా వైరాగ్యం గా మాట్లాడడానికి కారణం మాత్రం అర్ధం గాక అందరూ తలా పట్టుకుంటున్నారు. అసలింతకీ సమంత కి ఏమైందని కోణం లో కూడా ఫాన్స్ తెగ చర్చించేసుకుంటున్నారు.
Next Story

