ఏం యాక్టివ్ ఉందొ కదా

సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యక్టివ్ గా ఉంటుంది. ఆమె పర్సనల్ అయినా ప్రొఫెషన్ విషయాలనైనా ... అన్నిటిలో ఎప్పుడూ యాక్టివ్ కనబర్చే సమంత అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి అనగానే ఆ కుటుంబానికి సంబందించిన బరువు బాధ్యతలను అప్పుడే నెత్తినెసేసుకుంది. తన భర్త సినిమాలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చెయ్యడమే కాదు... తన మామగారు సినిమాలను కూడా తెగ పబ్లిసిటీ చెయ్యడం మొదలు పెట్టేసింది. చైతు 'యుద్ధం శరణం' పబ్లిసిటీని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న సామ్ ఇప్పుడు నాగ్ తాను కలిసి నటించిన 'రాజుగారి గది 2 ' మోషన్ పోస్టర్ విషయంలో నాగార్జునని పొగిడేసింది.
నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఓం కార్ డైరెక్షన్ లో వస్తున్న 'రాజుగారి గది 2 ' మోషన్ పోస్టర్ని రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఆ పోస్టర్ చూసిన సమంత తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జునని అభినందిస్తూ ఏమందంటే... నాగ్ మామ ఒక రాజు లాంటివాడు . ఆయనకు ఆయన్ను ఎలా పాలించుకోవాలో తెలుసు. అసలు ఏళ్లు గడిచే కొద్ది నా మావయ్య ఇంకా గ్రేట్ గా అవుతున్నారు.. అంటూ రాజుగారి గది మోషన్ పోస్టర్ని విడుదల చేసింది. మరి కోడలు ముచ్చటగా మావయ్య నువ్వు గ్రేట్ అంటూ పొగిడితే నాగ్ మాత్రం ఊరుకుంటాడా... అందుకే థాంక్యూ డియర్ కోడలా అంటూనే, నువ్వు చాలా బెస్ట్ అంటూ ప్రేమతో రీపోస్టు చేసాడు.
ఇక సమంత తన మావయ్య నాగ్ ని అభినందిచడమే కాదు 'రాజుగారి గది 2 ' కి మంచి మ్యూజిక్ అందించిన థమన్ ని కూడా పొగిడేసింది. థమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడంటూ... హర్రర్ కింగ్ అంటూ కితాబునిచ్చేసింది.

