ఎలాగైనా కొట్టేస్తాడులే!!

టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోస్ లో నాని ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో దోసుకుపోతున్న నాని రెమ్యునరేషన్ కూడా నాలుగు కోట్ల నుంచి అయిదు కోట్ల వరకు వుంది. 'నేను లోకల్' సినిమా వరకు రెమ్యునరేషన్ విషయంలో కాస్త చూసి చూడనట్టు పోయిన నాని ఇప్పుడు తాజా చిత్రానికి దాదాపు నాలుగు కోట్లు పైమాటే పారితోషకాన్ని అందుకున్నాడనే టాక్ వినబడుతుంది. మరి నాని 'నిన్నుకోరి' చిత్రానికే అంత పారితోషకం అందుకుంటే సినిమాకి ఇంకెంత బడ్జెట్ అయ్యుండాలి అనే డౌట్ వస్తుంది కదూ.
'నిన్నుకోరి' సినిమాకి బడ్జెట్ 15 కోట్లు దాటిందనే మాట వినబడుతుంది. అదేం పెద్ద బడ్జెట్ కాదనుకోండి. ఎందుకంటే నాని సినిమాలు దాదాపు 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు కొల్లగొడుతున్నాయి. అందుకే ఇప్పుడు 'నిన్నుకోరి' బడ్జెట్ పెద్దది కాదంటున్నారు. నాని గత చిత్రం 'నేను లోకల్' మాస్ ఎంటర్టైనర్ గా మంచి విజయం సాధించి 30 కోట్లు కొల్లగొట్టిందంటున్నారు. మరి ఇప్పుడు తాజా చిత్రం మంచి క్లాస్ చిత్రంగా తెరకెక్కింది. మరి మినిమమ్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన 'నిన్నుకోరి' చిత్రం 30 కోట్లు కొల్లగొడుతుంది అంటే కాస్త డౌట్ అంటున్నారు.
మరి 'నిన్నుకోరి' చిత్రం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది కాబట్టి ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగి ఆ బడ్జెట్ ని ఈజీగానే సాధిస్తుందని అంటున్నారు.. ఇక శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే మొత్తం నిర్మాతలకు మిగులు అవుతుంది. ఇకపోతే 'నిన్నుకోరి' చిత్రం విడుదలయ్యేటప్పుడు పెద్ద సినిమాల కాంపిటేషన్ ఏం లేకపోవడం ఈ చిత్ర వసూళ్లకు ప్లస్ అని చెప్పాలి. ఇక నివేత థామస్ తో జోడి కడుతున్న నాని 'నిన్నుకోరి' చిత్రం వచ్చేనెల 7 న విడుదలకు సిద్ధమవుతుండగా ఈనెలాఖరున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది.

