ఎన్టీఆర్ మళ్ళీనా?

జై లవ కుశ తో యావరేజ్ హిట్ ని అందుకొని ఊరటపొందిన ఎన్టీఆర్ మల్లి లాంగ్ గ్యాప్ తర్వాత తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఒకప్పుడు బాగా బొద్దుగా వున్న అంటే... రాఖి సినిమా టైం లో ఎన్టీఆర్ ఎంత లావుగా వున్నాడో.. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా యమదొంగ మూవీ కోసం ఎన్టీఆర్ అప్పట్లో సన్నగా అయ్యాడు. రాజమౌళి కోసం బాగా సన్నబడిన ఎన్టీఆర్ చాలాకాలంగా అదే ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్నాడు.
అయితే మళ్ళీ జై లవ కుశ లోని రావణ క్యారెక్టర్ కోసం కోసం కాస్త లావయ్యాడు. అందుకే జై లవ కుశ లో ఎన్టీఆర్ చాలా చోట్ల కాస్త లావుగా కనబడి ఇబ్బంది పెట్టాడు. జై పాత్ర కోసం బరువు పెరగడం అనేది ఇప్పుడు సమస్య అయ్యిందట. త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్న ఈ హీరో కి త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కి మేకోవర్ గురించి చెప్పాడట. త్రివిక్రమ్ చెప్పిన మేక్ఓవర్ విన్న ఎన్టీఆర్ వెంటనే బరువు తగ్గించే పనిలో పడ్డాడట. అంతే ఎన్టీఆర్ కు లైపో సెక్షన్ ఆపరేషన్ జరిగిందని ఫిలిం నగర్ లో పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆపరేషన్ సంగతి ఎలా ఉన్నప్పటికీ రూమర్ మాత్రం ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతుంది అని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు.
అయితే యమదొంగ టైం లోను ఎన్టీఆర్ లైపో చేయించుకునే సన్న బడ్డాడని అనేక రకాల వార్తలు నెట్టింట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని ఇంటర్వూస్ లో అది నిజం కాదని ఎన్టీఆర్ మొత్తుకున్నా ఎవరు నమ్మలేదు. మరి ఇప్పుడు త్రివిక్రమ్ తో మూవీ చేయాలనీ ఎప్పట్నుంచో భావిస్తున్న ఎన్టీఆర్ ఆ మూవీ కోసం తన లుక్ నే చేంజ్ చేసే పనిలో పడ్డాడు. అందుకోసం సన్నబడే కార్యక్రమాలు మొదలెట్టాడు. చూద్దాం త్రివిక్రమ్ మూవీ లో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో అనేది.

