ఎన్టీఆర్ ని చంపేశావ్ పో అంటున్న మెగా హీరో

మరొక్క పదిరోజుల్లో విడుదల కాబోతున్న 'జై లవ కుశ' గురించి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటే ఓవర్సీస్ కూడా ఎదురు చూస్తుంది. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' తర్వాత ఎలాంటి కథతో రాబోతున్నాడు... ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడా అనే క్యూరియాసిటీతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులైతే అస్సలు చెప్పక్కర్లేదు. వారు ఇప్పటికే పండగ చేసుకోవడం స్టార్ట్ చేశారు. 'జై లవ కుశ' పాటలతోపాటు ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా అందుకున్న వారు... భూమిమీద ఆగడంలేదు.
అయితే 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న ఆదివారం రాత్రి అలా యూట్యూబ్ లో విడుదల చేశారో లేదో ఆ ట్రైలర్ మీద మెగా హీరో ఒకరు..... తారక్ నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో స్పందించాడు. 'జై లవ కుశ' ట్రైలర్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని మూడు పాత్రలలో ఎలా వుండబోతుందో అనేది చూపించారు. ఇక ఆ ట్రైలర్ చూసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తారక్ 'చ.. చ.. చ... చంపేశావ్ తారక్’ అంటూ ట్వీట్ చేసాడు. ఇలా సాయి, తారక్ ని పొగుడుతూ చేసిన మొదటి ట్వీట్ అందరిని ఆకట్టుకుంది.
ఇక 'జై లవ కుశ' ట్రైలర్ లో ఎన్టీఆర్ జై పాత్రలో కుమ్మేసాడు. మొహంలో ఆగ్రహం, కళ్ళలో కసి, మాటలో నత్తి, నోటిలో పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఇరగదీసాడు. ఇక లవ, కుశ లు ఇద్దరూ కామెడీ చేస్తూ ఆకట్టుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమాకి జై పాత్రే ప్రాణం అన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక 'జైలవకుశ' ట్రైలర్ ని వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి కూడా ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.

