ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదో రికార్డ్ అంటున్నారు!!

ఎన్టీఆర్ - బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఏమిటని అందరూ ముందు కాస్తంత కంగారుపడ్డా... 'జై' టీజర్ తో ఆ అనుమానాల్ని పటాపంచలపోయాయి. 'జై లవకుశ' లోని 'జై' టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదరగొడుతున్నాడు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్కెట్ లో బాగా గిరాకీ ఏర్పడింది అంటున్నారు. 'జై లవ కుశ' చిత్ర హక్కులను దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కట్టడడమే కాదు ఎగబడిపోతున్నారనే టాక్ వినబడుతుంది.
అయితే నిర్మాత కళ్యాణ్ రామ్ మాత్రం ఈ అవకాశాన్ని ఆచి తూచి మరీ క్యాష్ చేసుకుంటున్నాడట. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. 'జై లవ కుశ'ని ఓ బడా నిర్మాత నైజాం, వైజాగ్ ఏరియా హక్కులని దాదాపు 30 కోట్లకి పైగానే దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే మరో బడా డిస్ట్రిబ్యూటర్ గుంటూరు, కృష్ణ జిల్లాల హక్కులని 12.6 కోట్లకి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మరో డిస్ట్రిబ్యూటర్ తూర్పుగోదావరి హక్కులని 5.7 కోట్లకి దక్కించుకున్నట్టు చెబుతున్నారు. కేవలం ఈ ఐదు ఏరియాస్ లోనే 'జై లవ కుశ' చిత్రం దాదాపు 43 కోట్లపై మాటే బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. మరి ఈ ఫిగర్ చూస్తుంటే 'జై లవ కుశ' మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఇకపోతే 'జై లవ కుశ' మిగతా ఏరియాస్ డిమాండ్ కూడా భారీగానే ఉన్నట్టు చెబుతున్నారు.
మిగిలిన ఏరియాస్ లో కూడా రికార్డు స్థాయిలోనే 'జై లవ కుశ' బిజినెస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి 'జై లవ కుశ' రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 70 కోట్ల పైమాటే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటుందని... ఈలెక్కన ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ బిజినెస్ ఒక రికార్డ్ అవుతుంది అంటున్నారు. మరి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21 న విడుదల తేదీ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

