Wed Dec 31 2025 04:45:16 GMT+0000 (Coordinated Universal Time)
ఎనర్జీ వెల్లువెత్తుతుందిట

సంతోష్ శ్రీనివాస్ - రామ్ కాంబినేషన్ లో వచ్చిన 'కందిరీగ' ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. అయితే అప్పట్లో 'కందిరీగ 2' కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఉంటుందని ప్రచారం జరిగింది. ప్రచారం ఏమిటి అంతా ఓకె అయిపొయింది కూడా. అయితే సడన్ గా రామ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం... ఆ స్టోరీ తో సంతోష్ ఎన్టీఆర్ తో 'రభస' సినిమా చేయడం... అది కాస్తా ప్లాప్ అవ్వడము జరిగిపోయాయి. ఇక సంతోష్ పనైపోయిన్ది అనుకున్నారు. మరో పక్క రామ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. అయితే రామ్ ఈ సంవత్సరం మొదట్లో 'నేను శైలజ' తో హిట్ కొట్టి కొంచెం గాడిన పడ్డాడు, ఈసారి కూడా హిట్ సినిమాతోనే ప్రేక్షకులని పలకరించాలని డిసైడ్ అయ్యి' కందిరీగ' తో హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో 'హైపర్' సినిమాని పట్టాలెక్కించాడు. అటు సంతోష్ కూడా ప్లాప్ తో సతమతమవుతూ ఉన్నందున రామ్ సినిమాకి వెంటనే సిగ్నల్ ఇచ్చి ఎంతో కసిగా ఈ 'హైపర్' ని తెరకెక్కిస్తున్నాడని ఆ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
'హైపర్' ఆడియో ని గత (శుక్రవారం)రాత్రి విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకలో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో రామ్ చాలా ఎనర్జిటిక్ గా... ఒక తండ్రి ని ఎంతగా ప్రేమిస్తాడో నే విషయాన్ని బాగా చూపించాడు సంతోష్. ఇక రాశి కన్నా తన అందాలతో పిచ్చెక్కించేలా ఈ సినిమాలో కనబడనుందని ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. రామ్ ఎక్కువగా ప్రేమించే తండ్రి గా సత్య రాజ్ ఈ సినిమాలో చాల ముఖ్యమైన పాత్ర పోషించినట్లు ట్రైలర్ లో చూపించారు. ఇక రామ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ట్రైలర్లో మచ్చుకు చూపించ దర్శకుడు ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు.
Next Story

