ఎట్టకేలకు ప్యాకప్ చెప్పేసారు

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' సినిమా షూటింగ్ జరుపుకుని... జరుపుకుని ఎట్టకేలకి ఇప్పుడు వారణాసి షెడ్యూల్ తో పూర్తయ్యింది. అక్కడ వారణాసి లో ఈ మూవీ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పింది చిత్ర బృందం. అక్కడ కాశీలో ఈ సినిమాకి సంబంధించిన హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ని తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ వారణాసి షెడ్యుల్ తో 'అజ్ఞాతవాసి' సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన 4 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందట. వచ్చే వారానికి ఈ ప్యాచ్ వర్క్ కూడా పూర్తవుతుందని తెలుస్తుంది.
ఇప్పటికే 'అజ్ఞాతవాసి' సినిమా హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు తమ పాత్రలకు సంబందించిన డబ్బింగ్ ని కూడా పూర్తి చేశారు. ఇకపోతే ఇప్పుడు 'అజ్ఞాతవాసి' జరుపుకున్న లేటెస్ట్ షెడ్యుల్ తో కలుపుకొని ఈ సినిమా కి అటుఇటుగా వందకోట్ల రూపాయల ఖర్చు లెక్క తేలిందనే టాక్ వినబడుతుంది. హారిక అండ్ హాసిని వారు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకి బడ్జెట్ పెట్టారనే విషయం ఈ ఖర్చయినా బడ్జెట్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా 70 శాతం పూర్తయింది.
అలాగే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పార్ట్ తప్ప మిగతా నటీనటుల డబ్బింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందట. ఇక ఈ నెలలో ఆడియో వేడుకని ఘనంగా జరపాలనే యోచనలో నిర్మాతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తీ సురేష్ , అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా 'అజ్ఞాతవాసి' గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

